Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పురుషుల వాలీబాల్ మ్యాచ్ కు హాజరై జైల్లో మగ్గుతున్న మహిళ

ఇరాన్ లో మహిళలపై ఆంక్షలు ఇంకా కఠినతరంగానే ఉన్నాయి. బ్రిటీష్-ఇరానియన్ మహిళ ఘోంచే ఘవామీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ కు హాజరవడమే కాక, "మీరు కూడా వాలీబాల్ మ్యాచ్ లకు వెళ్ళగలగాలి" అని ఇతర మహిళలకు పిలుపునిచ్చింది. అదే ఆమె చేసిన నేరం! వెంటనే ఇరాన్ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. రిమాండ్ ఖైదీగా ఆమెను ఇప్పటికే మూడు నెలలకు పైగా జైల్లో ఉంచారు. లా గ్రాడ్యుయేట్ అయిన ఘవామీ టెహ్రాన్ లోని ఆజాదీ స్టేడియంలో జరుగుతున్న ఇరాన్-ఇటలీ పురుషుల వాలీబాల్ మ్యాచ్ చూసేందుకు వెళ్ళింది. ఇరాన్ లో క్రీడాపోటీల సందర్భంగా మహిళలు పురుష ప్రేక్షకులతో కలిసి కూర్చోవడం నిషిద్ధం. ఈ నేపథ్యంలో ఆమెను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించారు. గతవారం ఆమె జైల్లో నిరశన దీక్ష చేపట్టారు. ఘవామీ వ్యవహారంపై స్పందించిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆమెను విడుదల చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టింది.

More Telugu News